బీజేపీ వార్డు సభ్యురాలు కాంగ్రెస్‌లో చేరిక
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
మంచిర్యాల: దండేపల్లి మండలం పెద్దపేట గ్రామానికి చెందిన బీజేపీ 4వ వార్డు సభ్యురాలు బొడ్డు సత్యవతి, ఆమె భర్త వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, గ్రామ నాయకులు బండారి వెంకటేష్, మల్లేష్, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.