BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 04 August 2026, 09:08 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మట్టిమాఫియా విశృతం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Aug, 2026 - 09:08 AM
60 వీక్షణలు

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మట్టిమాఫియా విశృతం..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు 

పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు చిన్నచెరువులో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖపై, ఇరిగేషన్ శాఖ పంచాయతీ శాఖపై బాధ్యతను నెట్టివేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఏతూరు చిన్నచెరువుతో పాటు మర్రిమాకులపల్లి నానప్ప చెరువు కూడా ఆక్రమణలకు గురైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పరిరక్షణలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై స్థానిక విఆర్వోను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదని స్థానికులు చెబుతున్నారు. అక్రమ మట్టి తరలింపు, చెరువుల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విఆర్ఓ వేణుగోపాల్ వివరణ:

ఇప్పటికే చాలా సార్లు తెలియజేశాము. ఐనా వారు పట్టించుకోలేదు.మీరు ఇరిగేషన్ వారిని సంప్రదించండి. అని అన్నారు.

ఇరిగేషన్ ఏఈ దీప వివరణ : అనమతులు తీసుకోవాల్సింది. ఐనా వారు తీసకోవడం లేదు. ఉన్నతాధికారులను సంప్రదఇంచండి అని ఉచిత సలహా ఇచ్చారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ వారిని అడగాలని తెలియజేశారు.

పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వసుంధర వివరణ :

చెరువులొ అక్రమ మట్టి తోలడం పై గ్రామపంచాయతీ కి ఎటువంటి సంబంధం లేదని, చెరువులో చేపల పెంపకం, చెట్లు నరకడం వంటివి చస్తామని వారు తెలియజేశారు.