BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 07:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఉదారత.. విద్యార్థులకు 50 గ్లాసుల విరాళం పోలవరం కెపి మోడల్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి నిరంతర సహకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:33 AM
77 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, పోలవరం కెపిలో విద్యార్థులు రాగిజావ తాగేందుకు అవసరమైన 50 స్టీల్ గ్లాసులను అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన పగుట్ల ప్రసాదరావు అందజేశారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ సేవను ఉపాధ్యాయులు అభినందించారు.

పగుట్ల ప్రసాదరావు గత కొంతకాలంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. జాతీయ పర్వదినాల సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడం, సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరసా శ్రీనివాసరావు, కారుమంచి దేవి, జక్కం రాజేష్, అలమంటి సిరి పగుట్ల ప్రసాదరావును ఘనంగా అభినందిస్తూ, ఆయన సేవాభావం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.