BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 10:10 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

​రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు ​

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Jul, 2026 - 10:10 PM
204 వీక్షణలు

రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు

​జంగల్ నాలా ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి

​హైదరాబాద్: రంగదాములపల్లె చెరువు నిల్వ సామర్థ్యాన్ని (స్టోరేజీ కెపాసిటీ) పెంచి, కింద ఉన్న గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా జంగల్ నాలా ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

​నివేదిక అందజేత:

రంగదాములపల్లె చెరువు, జంగల్ నాలా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను, శాశ్వత పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి అందజేశారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను, వీటి వల్ల స్థానిక రైతులకు, ప్రజలకు చేకూరనున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

​సానుకూలంగా స్పందించిన మంత్రి:

మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై సానుకూల ముందడుగు పడినట్లు సమాచారం. ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి పాల్గొన్నారు.