BREAKING
ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన స్మృతి వనం… ఆశయాల బాట! మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యత నీట్‌ పరీక్ష రేపే టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన స్మృతి వనం… ఆశయాల బాట! మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యత నీట్‌ పరీక్ష రేపే టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం
www.ntodaynews.com

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

తెలంగాణ
11 Jan, 2026 - 06:23 AM
108 వీక్షణలు

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

NTODAY NEWS: నల్గొండ  శివాజీనగర్‌లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మరియు ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల, క్రీడల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. డివైఎఫ్ఐ యువతకు విద్య, ఉపాధి కోసం పోరాటాలు చేస్తూనే, మహిళల సృజనాత్మకతను వెలికి తీసే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామన్నారు. యువతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను గుర్తు చేస్తూ, స్వయం ఉపాధికి 10 లక్షల వడ్డీ లేని రుణం, నిరుద్యోగ భృతి రూ.4,000 వంటి హామీలు రెండు సంవత్సరాలు గడిచినా అమలుకాలేదని విమర్శించారు. హామీల అమలు కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువతను ఏకం చేసి పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. అలాగే ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ, మహిళా హక్కులు, మహిళా రక్షణ కోసం ఐద్వా నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. పోటీల వివరాలు ముగ్గుల పోటీల్లో సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు మొదటి, రెండవ, తృతీయ బహుమతులను పాండురంగ టెక్స్టైల్స్ మరియు సి.కే. హాస్పిటల్ వారు అందజేశారు పాల్గొన్నవారు ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, బాతుక సత్తయ్య అధ్యక్షత వహించారు. అలాగే మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ సయ్యద్ హషమ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, న్యాయవాది శ్యామ్ సుందర్, డివైఎఫ్ఐ నాయకులు రఘువరన్, గంజి రాజేష్, కుమార్, గణేష్, మహేష్, కొమ్ము నాగరాజు, ఐద్వా నాయకురాలు అనురాధతో పాటు అంకిత, అనుముల జ్యోతి, సంతోష్, గౌరీ, సాయి మానస, రాగం స్వాతి, గీత, కాలనీ వాసులు రమేష్, వెంకటేశ్వర్లు, రిషిత, రోజా, ప్రణయ్, సుహాసిని, పావని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube