BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 19 July 2026, 07:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రోడ్డుపై కాకుండా బల్లలపై ఆకుకూరలు విక్రయించాలి: ప్రజల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 07:38 PM
108 వీక్షణలు

రోడ్డుపై కాకుండా బల్లలపై ఆకుకూరలు విక్రయించాలి: ప్రజల విజ్ఞప్తి

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట, జూలై 19: విస్సన్నపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద, పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రతిరోజూ పలువురు చిరు వ్యాపారులు ఆకుకూరలను రోడ్డు పక్కనే నేలపై ఉంచి విక్రయిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ విధంగా విక్రయించినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అయితే ఇటీవల తిరువూరులో ఓ బాలికకు వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఆకుకూరలను నేరుగా నేలపై ఉంచి విక్రయించడం వల్ల దుమ్ము, ధూళి, ఇతర కాలుష్యాలు తగిలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. కాబట్టి చిరు వ్యాపారులు ఆకుకూరలను బల్లలు లేదా స్టాండ్లపై ఉంచి పరిశుభ్రంగా విక్రయించాలని కోరుతున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆకుకూరల విక్రయంలో పరిశుభ్రత పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.