BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 02:24 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సుచిత్ర సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. భర్త మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Oct, 2026 - 02:24 PM
12 వీక్షణలు

హైదరాబాద్: సుచిత్ర సెంటర్‌ సమీపంలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ యూటర్న్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. టీఎన్‌ఆర్‌ మాల్‌లో సినిమా చూసి దంపతులు బైక్‌పై కొంపల్లికి వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. చికిత్స పొందుతూ భర్త అర్జున్‌ సర్దా (38) మృతి చెందారు. ఆయన భార్య గుర్జన్‌ సర్దా (34) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం అనంతరం కారు అక్కడే వదిలి డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారు పోలీసుల ఆధీనంలో ఉన్నప్పటికీ డ్రైవర్‌ను ఇంకా అరెస్ట్‌ చేయలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

ఈ ఘటనపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, డ్రైవర్‌ ఆచూకీపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.