BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 06:34 pm
Posted by : K MAHESH

ఆరుట్ల బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 06:34 PM
19 వీక్షణలు

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: ఆలయ కమిటీ చైర్మన్ అనంగల్ల యాదయ్య

రంగారెడ్డి జిల్లా | ఇబ్రహీంపట్నం | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో మొత్తం రూ.45 లక్షల నిధులు మంజూరైనట్లు ఆలయ కమిటీ చైర్మన్, ఆరుట్ల మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య తెలిపారు.

మంగళవారం ఆరుట్ల గ్రామంలో జాతర ఏర్పాట్లలో భాగంగా రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను, ఆలయ సమీపంలో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న అతిథిగృహ పనులను ఆయన ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అనంగల్ల యాదయ్య మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని, జాతరకు వచ్చే వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అతిథిగృహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జాతర ప్రారంభమయ్యేలోగా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆరుట్ల వార్డు సభ్యుడు ఎండీ ఇమ్రాన్, ఆలయ కమిటీ సభ్యులు వెదిరే రమణారెడ్డి, మానిపాటి వెంకటేష్, ఎన్నిదుల సురేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నర్సింహా, బుట్టి కృష్ణ, కంబాలపల్లి బుగ్గరాములు, కోరె బాబు, ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం, నాయకులు మార సురేష్, మాదగోని జంగయ్య గౌడ్, భాస్కర్ రైనా, ఎండీ అశ్రఫ్, ఆడెపు మధు, లొంగారి భాస్కర్, కాసుల ఆంజనేయులు, దూసరి రాజు, పంబాల టిల్లు, ప్రజాబలం గళం భూపాల్ తదితరులు పాల్గొన్నారు.