BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 22 June 2026, 08:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 08:10 PM
103 వీక్షణలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి దేశ సేవకు గౌరవం.. వీర జవాన్ కుటుంబానికి, మాజీ సైనికుడికి ఇంటి స్థలాల మంజూరు

దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు.

మదనపల్లె మండలం కురవంక గ్రామానికి చెందిన దివంగత వీరజవాన్ బి.సాయి తేజ గారి భార్య శ్రీమతి బి. శ్యామలకు ప్రభుత్వం ప్రత్యేక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేసింది. ఈ మేరకు మదనపల్లె మండల పరిధిలో 0.06 సెంట్ల భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను  బి. శ్యామలకు జిల్లా కలెక్టర్ అందజేశారు.

అలాగే యుద్ధంలో అంగవైకల్యం పొందిన మాజీ సైనికుల కోటా కింద మదనపల్లె మండలం ప్రశాంత్‌నగర్‌కు చెందిన మాజీ హవనీర్ వి. సుబ్బారెడ్డికి కూడా 0.06 సెంట్ల భూమికి సంబంధించిన ఇంటి స్థలం మంజూరు ప్రొసీడింగ్స్‌ను కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..., దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తుందని తెలిపారు. దేశం కోసం సేవలందించిన సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.