BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 29 March 2026, 03:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సభలో అప్రజాస్వామిక హంగామా దురదృష్టకరం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:32 PM
202 వీక్షణలు

సభలో అప్రజాస్వామిక హంగామా దురదృష్టకరం: బట్టి విక్రమార్క

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ సభలో సభ్యునిగా అనేక బడ్జెట్ సమావేశాలను చూసిన నేను, బట్టి విక్రమార్కగా చెప్పదలచుకున్నది ఏమిటంటే—గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు బడ్జెట్ ప్రతులను చింపివేయడం, చెవిలో పూలు పెట్టుకుని సభను విడిచి వెళ్లడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం నిజంగా దురదృష్టకరం.

రాష్ట్రంలోని వృద్ధులు, తల్లిదండ్రుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఒక కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది. అటువంటి ముఖ్యమైన బిల్లుపై చర్చించాల్సింది పోయి, అనుభవజ్ఞులైన సభ్యులే సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలను పక్కనపెట్టి అల్లరి చేయడం శోచనీయం.

సభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి, కేవలం నినాదాలు, చప్పట్లతో సభ సమయాన్ని వృథా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజల పక్షాన నిలబడి చర్చలు జరపాల్సిన ఈ వేదికను, స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం సరైంది కాదు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అందరికీ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ప్రజలను వంచించడమే.

పదేళ్ల పాలన తర్వాత ప్రజలు తమకు మేలు జరుగుతుందని ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారు. ఆ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పవిత్రమైన సభను అంగడిలా మార్చకుండా, ప్రజాస్వామ్యంపై గౌరవంతో సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాను.