BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 09 April 2026, 03:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 03:07 PM
228 వీక్షణలు

సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్ర: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి

అనంతపురం నుండి బండ్లపల్లి వరకు మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం

 భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండ్లపల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా, చింతలపూడి (మం) మల్లయ్య గూడెం గ్రామంలో ఉపాధి హామీ పథక పనులను పరిశీలించారు.

సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల గురవయ్య, మండల కార్యదర్శి తొర్లపాటి బాబు మాట్లాడుతూ, "కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి, ఎలాంటి హక్కులు లేని విబిజి రాంజీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది గ్రామీణ పేదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది" అని తెలిపారు.

ఈ పాదయాత్రలో, సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, బీకేఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మరియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్ నాయకత్వం వహించనున్నారు.