BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంక్షేమం - ఎన్డీయేతోనే సాధ్యం: డా. ఉమేష్ రావు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:54 PM
144 వీక్షణలు

సంక్షేమం - ఎన్డీయేతోనే సాధ్యం: డా. ఉమేష్ రావు

శ్రీకాళహస్తి : పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమాన్ని చేతల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు అన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పూసల వీధిలో పింఛన్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గాలి చలపతి నాయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, ఇతర నాయకులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. జూన్ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసినట్లు, అలాగే కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ.65,886.57 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు మరియు అభివృద్ధిని చూసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, కోలా ఆనంద్, డా. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, చాంద్ బాషా, బి. గిరిధర్, కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.