BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 25 March 2026, 10:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 10:40 PM
170 వీక్షణలు

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను నిన్న సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

వాతావరణ మార్పుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు ఛాతీలో అసౌకర్యం అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

సోనియా గాంధీ గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కూడా ఇదే సమస్యతో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమెను వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు త్వరలో అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.