BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 28 June 2026, 02:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Tirumala: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ భారీ కానుక.. టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 02:25 PM
336 వీక్షణలు

తిరుమల | NTODAY NEWS

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ విరాళం అందించారు.

తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ, భక్తుల రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సులను తిరుమలలో భక్తుల రవాణా కోసం వినియోగించనున్నట్లు సమాచారం. బస్సులతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, అలాగే డ్రైవర్ల జీతభత్యాల వ్యయాన్ని కూడా రిలయన్స్ సంస్థ భరించనుంది.

ఈ విరాళం ద్వారా తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థకు మరింత బలం చేకూరనుండగా, ప్రతి రోజు శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.