BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 20 July 2026, 08:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సూరంపాలెంలో మన డబ్బు–మన లెక్కలు అవగాహన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 08:20 PM
158 వీక్షణలు

సూరంపాలెంలో మన డబ్బు–మన లెక్కలు అవగాహన ర్యాలీ

ఏలూరు జిల్లా ముసునూరు మండలం సూరంపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో 'మన డబ్బు–మన లెక్కలు' కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని శ్రీ చైతన్య వీఓ పరిధిలోని మొత్తం 34 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము మాట్లాడుతూ, ప్రతి డ్వాక్రా సభ్యురాలు 'మన డబ్బు–మన లెక్కలు' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ గ్రూపుల ఆర్థిక లావాదేవీలు, పొదుపులు, రుణాల వివరాలను ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకునేలా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యాప్ వినియోగంతో పారదర్శకత పెరిగి, గ్రూపుల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో వెలుగు సీసీ పోతురాజు, బుక్ కీపర్ గుడిమల్ల కిరణ్ కుమారి, డ్వాక్రా గ్రూపుల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.