BREAKING
thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం
Date of Publish : 19 September 2026, 02:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సూరంపాలెంలో సేవా సంకల్ప అభియాన్ ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 02:59 PM
17 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సూరంపాలెం సచివాలయంలో శనివారం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని చాట్రాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల ప్రాధాన్యత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో కొనసాగుతూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి, జాతీయ రహదారులు, విశాఖపట్నం–భోగాపురం విమానాశ్రయం, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అందుతున్న కేంద్ర నిధుల గురించి వివరించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా తెలియజేసే ఉద్దేశంతో రూపొందించిన 104 పేజీల పుస్తకాన్ని కూటమి నాయకులు, ప్రజలకు అందజేశారు. అంత్యోదయ స్ఫూర్తితో కేంద్ర పథకాల సమాచారాన్ని చివరి వ్యక్తి వరకు చేరవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నూజివీడు అసెంబ్లీ ఎస్సీ సెల్ కన్వీనర్ నక్కా రాము చనుబండ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వర రావు తదితరులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి, మొదటి పోలింగ్ బూత్ అధ్యక్షుడు చిట్టెం శ్రీనివాసరావు, మోదుగు ముత్తయ్య, గౌర వెంకటేశ్వరరావు, దార్ల సురేష్, నక్క రత్నారావు, గవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది ఎంపీహెచ్‌ఈఓ పీవీ శ్రీధర్, ఎంపీహెచ్‌ఎస్‌ సత్యవాణి, జి. ప్రభాకర్, ఎంఎల్‌హెచ్‌పీ–సీహెచ్‌ఓలు కె. శాంతి, కె. కీర్తి, రామతులసి, వీరస్వామి, ఏఎన్‌ఎంలు కె. సుజాత, జి. తిరుమలకుమారి, ఎంపీహెచ్‌ఏలు కె. జోజిబాబు, సురేష్ ప్రభాకర్, ఆశా కార్యకర్తలు సునీత, కృష్ణకుమారి, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

సందర్భంగా డాక్టర్ దుర్గా ప్రసాద్ తో పాటు వైద్య సిబ్బంది ని ఘనంగా శాలువాలతో సత్కరించారు