BREAKING
thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb చోడవరంలో రాజకీయ వేడి.. thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం
Date of Publish : 19 September 2026, 02:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వనమారెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 02:59 PM
41 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం: పెద్దకొమిర పంచాయతీ శివారు వనమారెడ్డిగూడెం గ్రామంలోని 91వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం జాతీయ పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. సీజన్‌లో లభించే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. చిన్నారుల ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శోభ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ స్వామి, అంగన్వాడీ కార్యకర్త కె. కుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు పాల్గొన్నారు.