BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సొసైటీ నుంచి రైతుల సభ్యత్వం రద్దు కుట్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 07:22 PM
306 వీక్షణలు

సొసైటీ నుంచి రైతుల సభ్యత్వం రద్దు కుట్ర ఆరోపణలు

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 24 మార్చి 2026

రెడ్డిగూడెం పిఎసిఎస్‌లో రైతుల సభ్యత్వాలను రద్దు చేయడానికి కుట్ర జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులపై లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25, 2026 తేదీతో నోటీసులు సిద్ధం చేసి, 15 రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్న అధికారులు, వాటిని మాత్రం మార్చి 20 నుంచి కొందరికి, మార్చి 24న మరికొందరికి అందజేయడం అనుమానాస్పదమని ఆయన అన్నారు. గడువు ముగిసిన తర్వాత నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

రాబోయే పిఎసిఎస్ ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా పరిస్థితులు సృష్టించేందుకు రైతుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సరైన కారణాలు లేకుండా నోటీసుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం అన్యాయమని మండిపడ్డారు.

ఈ విధమైన చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఇప్పటికే జారీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్, జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి కృష్ణారెడ్డి, గుడిశె ప్రభాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీపీ మైలమాల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.