BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 03 April 2026, 03:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 03:34 PM
555 వీక్షణలు

సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు…  చాట్రాయిలో అధికార యంత్రాంగం హస్తగతం గ్రామ పాలన!

18 గ్రామపంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియడంతో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని 18 గ్రామపంచాయతీలు ఇప్పుడు అధికార యంత్రాంగం ఆధీనంలోకి వెళ్లాయి. గ్రామ పాలనలో ఖాళీ ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి స్పెషల్ ఆఫీసర్లను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్థానిక ప్రజాప్రతినిధుల స్థానంలో అధికారుల పాలన మొదలవడంతో గ్రామాల్లో రాజకీయంగా కూడా చర్చలు జోరందుకున్నాయి. అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయా…? లేక ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారా…? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

నియమితుల వివరాలు ఇలా ఉన్నాయి:  

బళ్ళా రాజు – (ఎంపీ డీవో) పోలవరం, నరసింహారావుపాలెం, చనుబండ, కృష్ణారావుపాలెం

దేవినేని ధమయంతి - (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ .ఎంపీడీవో ఆఫీస్) ఆరుగొలనుపేట, జనార్ధనవరం

కొప్పినేని అనిల్ – (డిప్యూటీ తహసిల్దార్) చిత్తపూరు, తుమ్మగూడెం

బండారు శివశంకర్ – (వ్యవసాయ అధికారి) చాట్రాయి, కొత్తగూడెం, మర్లపాలెం, సోమవరం

మాసగిరి శ్రీనివాసరావు – (విద్యాశాఖ అధికారి 1) బూరుగుగూడెం, పర్వతాపురం, పోతనపల్లి

వి.ఎస్.వి. బ్రహ్మాచారి –(విద్యాశాఖ అధికారి 2) చిన్నంపేట, కోటపాడు, చీపురుగూడెం

సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో గ్రామస్థాయిలో అధికార వ్యవస్థే కీలక పాత్ర పోషించనున్నది. తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన ఈ స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ధి కార్యక్రమాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూడాల్సి ఉంది.

గ్రామాల్లో చర్చ ఇదే…

“ఎన్నికల వరకు అధికారులు పాలన ఎలా ఉంటుందో?” అనే ఆసక్తి ఒకవైపు, “ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందా?” అనే అనుమానం మరోవైపు వ్యక్తమవుతోంది.