BREAKING
thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:10 pm
Posted by : PAGADALA DEVAIAH

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయాలను కొనసాగించాలి: బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
31 Oct, 2026 - 07:10 PM
9 వీక్షణలు
  • చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు
  • సరస్వతీనగర్‌ చౌరస్తాలో పటేల్‌ జయంతి వేడుకలు

ఎల్‌బీనగర్‌, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): భారత తొలి హోంమంత్రి, మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని గడ్డిఅన్నారం డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు జయప్రకాష్‌ ఆధ్వర్యంలో సరస్వతీనగర్‌ చౌరస్తాలో జయంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డిఅన్నారం డివిజన్‌ బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి హాజరై పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

దేశ సమగ్రతకు పటేల్‌ సేవలు చిరస్మరణీయం

ఈ సందర్భంగా బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాల విలీనంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో, రజాకార్ల కార్యకలాపాలకు ముగింపు పలికే క్రమంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్‌ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను నేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు చిలుకూరి రాంరెడ్డి, బీజేపీ నాయకులు మురళి, ఓంకార్‌, బద్దం వివేకానందరెడ్డి, సుబ్బారెడ్డి, భీష్మాచారి, బాబు చౌదరి, సతీష్‌ చారి, కిరణ్‌ మై, దేవి, వివేక్‌ చారి, శ్రీకాంత్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.