BREAKING
ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది....

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 09:51 AM
10 వీక్షణలు

పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది....

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జన్మించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శని ప్రసాదరావు

తెల్లదొరల బానిసత్వం నుండి భరతమాత దాస్యశృంఖలాలని తెంపేందుకు ఎందరో వీరుల త్యాగఫలమే నేటి అఖండ స్వేచ్ఛా భారతం

దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై అలుపెరుగని పోరాటం చేసిన భరతమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర్య సమరయోధుడు సర్వశ్రీ స్వర్గీయ నరహరిశెట్టి శనిప్రసాదరావు  

అప్పటి కృష్ణాజిల్లా నూజివీడు సంస్థానం యర్నగూడెం గ్రామంలో1906న వెంకట్రాయుడు చెల్లాయమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు

విద్యాబ్యాసం పూర్తి కాగానే యువకుడైన ప్రసాదరావు వారసత్వంగా వచ్చిన వీరవల్లి సంజీవపురం గ్రామాలకు ఇప్పటి (టోల్ ప్లాజా) మునసబు కరణం బాధ్యతలను చేపట్టినా మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు బానిస బతుకుల విముక్తికోసం బ్రిటీష్ సామ్రాజ్యంపై ఎదురుతిరిగి అలుపెరుగని పోరాటం చేయడానికి కుటుంబ వాత్సల్యాన్ని అధికారహోదాను వీడి భారత జాతీయ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న ధీరోదాత్తుడు

గాంధీమహాత్ముని పిలుపుతో  ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తెల్లదొరల దాష్టీకానికి ప్రాణాలు సైతం లెక్కచేయక ఎదురొడ్డి నిలిచిన ప్రసాదరావును బ్రిటీష్ ప్రభుత్వం బళ్ళారి రాయవెల్లూరు అలిపురం రాజమహేంద్రవరం కేంద్ర కారాగాల్లో మూడు సంవత్సరాలుపైగా కఠిన కారాగార శిక్షవిధించి నిర్బంధించింది

జాతీయ ఉద్యమ నాయకులు అప్పటి వివి గిరి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి  తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు నాడార్   ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు బెజవాడ గోపాలరెడ్డి  పివిజి రాజు తదితరులతో అత్యంత సాన్నిహిత్యం కలిగి ఉద్యమంలో కీలక పాత్ర పోషించేవారు

స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి తామ్రపత్రంతో ఘనంగా సన్మానించింది

పదవులను ఆశించకుండా నవసమాజ నిర్మాణం కోసం కృషిచేస్తూ భద్రాచలం కూనవరం ఎజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యునిగా భద్రాచలం ఏజెన్సీ బోర్డ్ డైరక్టర్ గా 25 సంవత్సరాలు సేవలు అందించిన గొప్ప దేశభక్తులు నరహరిశెట్టి శనిప్రసాదరావు