BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 15 August 2026, 08:49 am
Posted by : గంగుల రాజ్ కుమార్

వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
15 Aug, 2026 - 08:49 AM
229 వీక్షణలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...

వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లక్షెట్టిపేట మండలం, వెంకట్రావుపేట:

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం సమర్పించారు.


ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వెంకట్రావుపేట ZPHS పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.


ఈ సందర్భంగా సర్పంచ్ నలిమేల రాజు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులని, వారిలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గ్రామ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


కార్యక్రమం అనంతరం విద్యార్థులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. దేశభక్తి నినాదాలతో వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ ఆవరణ సందడిగా మారింది.