BREAKING
ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది....
www.ntodaynews.com

జనసేన పార్టీ అశ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 02:21 PM
4 వీక్షణలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అశ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, పెద్దయెత్తున పాల్గొన్న మహిళలు NDA శ్రేణులు.


80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ భారత దేశప్రధాని నరేంద్ర మోడీ భారత దేశ ఔన్నత్యం కోసం , దేశ భక్తి భావం ప్రతి పౌరుడిలో నింపడం కోసం హర్ ఘర్ తిరంగా ర్యాలీల రూపంలో , ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎరుగురవేసి కులం మతం వర్గం ప్రాంతం అనే తారతమ్యం లేకుండా మన దేశ ఐక్యతను చాటాలని పిలువును ఇవ్వడం జరిగింది.దేశ భక్తిని పెంపొందించే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నాయుడు , మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించి దేశ పౌరుల్లో దేశం పట్ల అంకిత భావాన్ని పెంపొందించే విధంగా నాయకులు కృషి చెయ్యాలని ఆదేశించడం జరిగింది.అందులో భాగంగానే నేడు జనసేన పార్టీ కదిరి నియోజక వర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ అధ్వర్యంలో మరియు NDA కూటమి నాయకులు , కార్యకర్తలు పెద్దఎత్తున R&B భవనం నుంచి అంబేద్కర్ కూడలి  వరకూ హర్ ఘర్ తిరంగా పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది.ప్రతి ఒక్కరూ దేశసమగ్రతకు , దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా కృషి చెయ్యాలని , దేశం కోసం ప్రాణాలను అర్పించిన   త్యాగధనుల పోరాట ఫలితమే మనం నేడు సంభవిస్తున్న స్వాతంత్యం అనే స్వేచ్ఛ వాయువు అని గ్రహించి దేశం పట్ల విదేశాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వారి భరతం పట్టాలని కులాలు , వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనం అంతా భారతీయులం దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేసే రేపటి పౌరులం అనేలా నేటి యువత ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందంటూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు భైరవ ప్రసాద్   మరియు NDA కూటమి నాయకులు తెలియజేశారు.

ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉత్తమ్ రెడ్డి , వెంకటేష్ , సుదర్శన్ , మైనొద్దీన్, ఇంతియాజ్, హసనాపురం చంటి , నందిశెట్టి బాబు , ఓబుల్ రెడ్డి , జనసేన పార్టీ నాయకులు కాయల చలపతి , లక్ష్మణ కుటాల,ఇర్ఫాన్ , మేకల చెరువు చౌదరి, పొరకల  రాజేంద్ర ప్రసాద్ , K.V. రమణ, పలవర శ్రీన , రామ్మోహన్ , అంజిబాబు , ప్రతాప్,హరిబాబు , రఘునాథ్ మరియు కూటమి కార్యకర్తలు , మహిళలు పెద్దఎత్తున హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.