BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:07 pm
Posted by : K MAHESH

గత ప్రభుత్వంలో స్కాములు.. ప్రస్తుత ప్రభుత్వంలో స్కీములు: ఎంపీ బలరాం నాయక్

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:07 PM
20 వీక్షణలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే మురళి నాయక్

నెల్లికుదురు | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మహబూబాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. మంగళవారం నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్‌లో మండల పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మార్గదర్శకత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, నూతన పింఛన్లు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, రోడ్లు, భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

నెల్లికుదురు మండలంలో 700 కొత్త పింఛన్లు మంజూరు

ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 4,000 నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. నెల్లికుదురు మండలంలో 700 పింఛన్లు మంజూరు కాగా, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు వివరించారు. సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న మరికొన్ని పింఛన్లకు కూడా త్వరలో మంజూరు పత్రాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల కేంద్రంలో నూతన విశ్రాంతి భవనం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నూతన పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్నారని తెలిపారు. సిద్దిపేటలో లక్ష మందితో నిర్వహించే సభలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్, ప్రత్యేక అధికారి జినుగా మరియన్న, ఐకేపీ ఏపీఎం నరేంద్ర కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, జిల్లా నాయకులు నాయుని సత్యపాల్ రెడ్డి, హెచ్. వెంకటేశ్వర్లు, గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్, అధికార ప్రతినిధి వరిపల్లి పూర్ణచందర్, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.