అంగన్వాడీ కేంద్రాల్లో సేవా సంకల్ప్ అభియాన్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మండలంలోని అమ్మిరెడ్డిగూడెం 184వ అంగన్వాడీ కేంద్రం, గంపలగూడెం 64వ అంగన్వాడీ కేంద్రం, చిన్న కొమిర అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, పరిశుభ్రత, పూర్వ ప్రాథమిక విద్య, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలు, తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కే. విజయలత, ఏ. నాగమణి, ఏ. ఉషారాణి, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.