BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 May 2026, 08:21 am
Posted by : కూనురు మధు

శివాలయం దగ్గర చేతి పంపున కు మోక్షమెప్పుడు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
11 May, 2026 - 08:21 AM
281 వీక్షణలు

శివాలయం దగ్గర చేతి పంపున కు మోక్షమెప్పుడు NTODAY NEWS చిట్యాల 

నిరుపయోగంగా ఐదు దశాబ్దాల బోరు.

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ  వార్డులో దశాబ్దాల చరిత్ర కలిగిన నీటి వనరు నేడు పాలకుల ఉదాసీనతకు నిలువుటద్దంగా నిలుస్తోంది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక శివాలయం పరిసరాల్లో దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రజల దాహార్తిని తీర్చిన చేతి పంపు, నేడు కేవలం ఒక నిరుపయోగమైన ఇనుప పైపుగా మారిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ బోరుకు చేతి పంపు  ఉండేది. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు, చుట్టుపక్కల నివసించే చాలా కుటుంబాలు ఈ నీటిపైనే ఆధారపడేవారు భూగర్భంలో నేటికీ పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ, కనీస మరమ్మతులు చేయకపోవడం వల్ల అది మూలకు పడింది.  ప్రస్తుతం వేసవి తీవ్రత దృష్ట్యా 11వ వార్డులో నీటి ఎద్దడి పెరగడం. దాహంతో అల్లాడుతున్న శివాలయం పరిసర ప్రాంతాలలో ​ప్రస్తుతం మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు సరిపోక, ప్రైవేటు టాంకర్లను ఆశ్రయించలేక సామాన్యులు అల్లాడుతున్నారు.  ​ఈ శివాలయం పక్కన ఉన్న బోర్వెల్‌ను తక్షణమే  చేతి పంపు గాని, మోటారు గాని బిగించి ప్రజలకు నీటిని సరఫరా చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను, ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు..