BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 10 July 2026, 07:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 07:40 PM
133 వీక్షణలు

హైదరాబాద్, జులై 10: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దివంగత నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి గురువారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శాంతకుమారి మరణవార్తతో సినీ అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

శోభన్ బాబు, శాంతకుమారి దంపతులు 1958 మే 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన శోభన్ బాబు, దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా విశేష గుర్తింపు పొందారు. "చివరి వరకు హీరోగానే గుర్తుండాలనే" తన సంకల్పంతో కెరీర్ చివరి దశలో అనేక సినిమా అవకాశాలను కూడా ఆయన తిరస్కరించారు. శాంతకుమారి మరణంతో శోభన్ బాబు కుటుంబాన్ని సినీ అభిమానులు, ప్రముఖులు సంతాప సందేశాలతో పరామర్శిస్తున్నారు.