BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 16 May 2026, 07:59 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శుభ ముహూర్తాలకు బ్రేక్.. మళ్లీ జూన్ 19 తర్వాతే!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 May, 2026 - 07:59 AM
150 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి తాత్కాలికంగా తగ్గుముఖం పట్టింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న అధిక జ్యేష్ఠ మాసం కారణంగా జూన్ 18 వరకు శుభ ముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు. దీంతో వివాహాలు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభాలు, ఆస్తుల కొనుగోళ్లు, శుభ ఒప్పందాలు వంటి ముఖ్య కార్యక్రమాలను చాలా కుటుంబాలు వాయిదా వేస్తున్నాయి. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం శ్రేయస్కరం కాదని భావించడంతో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రభావం కేవలం కుటుంబ శుభకార్యాలపైనే కాకుండా వాటిపై ఆధారపడిన అనేక వ్యాపార రంగాలపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు, డెకరేషన్ వ్యాపారాలు, టెంట్ హౌస్‌లు, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులు, బ్యాండ్ బాజా బృందాలు, పూల వ్యాపారులు వంటి రంగాలు నెలరోజులపాటు పనుల కొరతను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా ఈ కాలంలో బిజీగా ఉండే వివాహ మండపాలు ఇప్పుడు వెలవెలబోతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తగ్గినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

మరోవైపు జూన్ 18 తర్వాత మళ్లీ వరుస ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి శుభకార్యాల సందడి భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలు తమ కార్యక్రమాలను ఆ తర్వాతి తేదీలకు మార్చుకుంటుండటంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలకు డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ రంగాలు మరో నెల రోజుల్లో మళ్లీ కళకళలాడనున్నాయని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.