BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 02 September 2025, 07:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పాఠశాల ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ

తెలంగాణ
02 Sep, 2025 - 07:29 AM
332 వీక్షణలు
పాఠశాల ప్రిన్సిపల్ కు షోకాజ్ నోటీస్ జారీ NTODAY NEWS: బొమ్మలరామారం బొమ్మలరామారం మండలంలో ప్రభుత్వ పాఠశాల,పల్లె దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం రోజున బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం బాగుంటుందా మెనూ ప్రకారం పెడుతున్నారని కలెక్టర్ విద్యార్థిని అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకి పెట్టే భోజనం నాణ్యత లేకపోవడం సరిగా వండకపోవడం పై ఏజన్సీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తంచేశారు, మూడు రోజుల్లో పని తీరు మారకపోతే ఏజెన్సీని తొలగించడంజరుగుతుందని హెచ్చరించారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై మంచిగా చదువుకోవాలని ఏరోజు పాఠాన్ని ఆరోజు పూర్తిగా వచ్చేంతవరకు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధన అందించాలన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం, పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేయమని డీఈఓ ని ఆదేశించారు. అనంతరం మండలంలోని మైలారం గ్రామంలో పల్లె దవాఖాన ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..ఆసుపత్రికి రోజు సిబ్బంది సమయానికి రావాలని చెప్పారు. సమయపాలన పాటించాలని, పాటించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. రోజు ఓపి కి ఎంత మంది పేషెంట్లు వస్తుంటారని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో జ్వరాల కేసులు ఎక్కువగా ఉన్నాయా, జ్వరం వచ్చినవారు మరి ఎక్కువగా ఇబ్బంది పడితే భువనగిరి జిల్లా ఆసుపత్రి కి పంపించాల తెలిపారు.ఈ ఆసుపత్రి పరిధిలో ఈ నెల ఈ.డి.డిలు ఎన్నిఉన్నాయో తెలుసుకున్నారు.అన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేల చూడాలి అన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు.అనంతరం మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్...గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయి, అవి ఏ దశల్లో ఉన్నాయో సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.మంజూరు అయినంత వరకు ఇండ్ల నిర్మాణ పనులు మొదలు అయ్యాయా ఇంకా ప్రారంభించకుండా ఉంటే వెంటనే మొదలు పెట్టేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు, ఇసుక ఉచితంగా ఇస్తున్నారా అని లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు. ఇటుక,సిమెంట్ కూడా స్థానిక తహసీల్దార్, ఎంపీడిఓ తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తున్నార అని ఆరా తీశారు.లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని డబ్బులు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని ప్రతి సోమవారం మీ అకౌంట్ లలో డబ్బులు జమ అవుతాయని అన్నారు.దసరా వరకు ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తిచేసుకుని గృహప్రవేశం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో పి. శ్రీనివాసరావు,ఎంపీడీవో రాజా త్రివిక్రమ్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube