BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 03:56 pm
Posted by : P. KISHORE

కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
25 Sep, 2026 - 03:56 PM
10 వీక్షణలు

అధికారులు వెంటనే స్పందించాలని నగరవాసుల విజ్ఞప్తి

[నగరం]: ట్రాఫిక్ నియంత్రణ కోసం నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్స్ స్తంభం ప్రమాదకరంగా మారిందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాత పోలీసు పరేడ్ మైదానం ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సిగ్నల్ లైట్స్ స్తంభం ప్రస్తుతం కూలేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఉందని స్థానికులు చెబుతున్నారు. స్తంభం అకస్మాత్తుగా కూలితే వాహనదారులు, పాదచారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే స్తంభం పరిస్థితిని సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని లేదా ప్రమాదకరంగా ఉంటే స్తంభాన్ని తొలగించి కొత్త సిగ్నల్ లైట్స్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ఇప్పుడే అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.