BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 17 February 2026, 08:05 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ
17 Feb, 2026 - 08:05 PM
404 వీక్షణలు
బీసీ సింహ గర్జన మహాసభ విజయంకోసం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: ఈ నెల 22న నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభ విజయవంతం కావాలని కోరుతూ పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ నేపథ్యంలో, నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ నాయకత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మహాసభ ఘనవిజయం సాధించాలని ప్రార్థించారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత, విద్యార్థులు, కార్మికులు మరియు ప్రజలకు సభలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుకు గురైన బీసీ వర్గాలు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “బీసీ సింహ గర్జన” సభ బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కుమ్మర గిరి బాబు, నాయకులు వెంకటేష్ యాదవ్, శంకర్, గణేష్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట్ యాదవ్ కూడా పాల్గొన్నారు. #BCSinhagarjana #BCYParty #SocialJustice #Punganur #ChittoorDistrict #PoliticalMeeting #CommunityUnity Follow us on Website Facebook Instagram YouTube