BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 13 February 2026, 03:31 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆరవ రోజు విశేషపూజలు, రాత్రి పుష్పపల్లకీ సేవ

తెలంగాణ
13 Feb, 2026 - 03:31 AM
405 వీక్షణలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: ఆరవ రోజు విశేషపూజలు, రాత్రి పుష్పపల్లకీ సేవ NTODAY NEWS: శ్రీశైలం/ నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్  శ్రీశైలం, ఫిబ్రవరి 13, 2026: మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకక్షేమం కోసం జపాలు, పారాయణాలు చేశారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి జపం, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం తదితర కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, రుద్రపారాయణలు, హోమాలు నిర్వహించనున్నారు. పుష్పపల్లకీ సేవ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ నిర్వహించనున్నారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేపు చేసి పూజలు జరుపుతారు. అనంతరం మేళతాళాల మధ్య పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ సేవలో ఎర్రబంతి, పసుపుబంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోజ్, అశోకపత్రాలు, గ్లాడియేలస్, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం తదితర పుష్పాలను వినియోగిస్తున్నారు. పురాణాలలో మల్లికార్జున స్వామి పుష్పప్రియుడిగా ప్రస్తావించబడిన నేపథ్యంలో మహాశివరాత్రి, దసరా మహోత్సవాల్లో ఈ పుష్పపల్లకీ సేవను సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. #Srisailam #MahaShivaratri #Brahmotsavams #PushpaPallaki #TempleRituals #SpiritualNews Follow us on Website Facebook Instagram YouTube