BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:44 am
Posted by : K MAHESH

బుగ్గారం పోలీసులకు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:44 AM
19 వీక్షణలు

సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వడంలో జాప్యం.. రెండోసారి విచారణకు ఆదేశాలు

నాలుగు రోజుల్లో ఫుటేజీ ఇస్తామన్న ఎస్సై హామీ అమలు కాలేదని బాధితుడి ఆరోపణ

బుగ్గారం / జగిత్యాల జిల్లా (ఎన్ టుడే న్యూస్)

బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో జరిగినట్లు ఆరోపిస్తున్న దాడి ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని సమాచార హక్కు చట్టం కింద కోరినా అందించకపోవడంపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంలో బుగ్గారం పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ, సంబంధిత సమాచారంతో రెండోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని బాధితుడు, సీనియర్ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి సోమవారం విలేకరులకు వెల్లడించారు.

చుక్క గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మే 1న కొందరు వ్యక్తులు బుగ్గారం పోలీస్ స్టేషన్‌లోనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై గుడికందుల సందీప్ ఐదుగురిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అదే రోజు పోలీస్ స్టేషన్‌లో రికార్డయిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అందించాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

చట్టబద్ధమైన గడువు ముగిసినా కోరిన సమాచారం అందకపోవడంతో అప్పటి ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు మొదటి అప్పీల్ చేసినట్లు గంగారెడ్డి వివరించారు. అక్కడి నుంచి కూడా స్పందన రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఫుటేజీ అందకపోవడంతో ఈ వ్యవహారం మరోసారి విచారణకు వెళ్లినట్లు తెలిపారు.

గత విచారణకు హాజరైన ఎస్సై గోంగాటి సతీష్.. నాలుగు రోజుల్లో సీసీటీవీ ఫుటేజీని దరఖాస్తుదారుడికి అందజేస్తామని కమిషన్ ముందు హామీ ఇచ్చారని గంగారెడ్డి పేర్కొన్నారు. అయితే ఆ గడువు ముగిసినా ఇప్పటివరకు ఫుటేజీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు సంబంధిత సమాచారంతో విచారణకు హాజరుకావాలని పోలీసు అధికారులను కమిషన్ ఆదేశించినట్లు వెల్లడించారు.

ముగ్గురు ఎస్సైల్లో బాధ్యత ఎవరిది?

ఫుటేజీ అందకపోవడానికి సంబంధించి ముగ్గురు ఎస్సైలు పనిచేసిన కాలాన్ని ప్రస్తావిస్తూ చుక్క గంగారెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఘటన జరిగిన సమయంలో కేసు నమోదు చేసిన ఎస్సై గుడికందుల సందీప్ ఫుటేజీ అందించకుండానే బదిలీపై వెళ్లిపోయారని అన్నారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఎస్సై తీగల అశోక్ నిందితులతో కుమ్మక్కై కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అనంతరం కమిషన్ విచారణకు హాజరైన ఎస్సై గోంగాటి సతీష్ సైతం ఫుటేజీ అందజేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు.

ఒకే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కోసం బాధితుడు ఇన్నేళ్లుగా అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఫుటేజీ అందుబాటులో ఉందా? ఉంటే దరఖాస్తుదారుడికి ఎందుకు అందించలేదు? సమాచారాన్ని నిలిపివేయడానికి బాధ్యత వహించాల్సిన అధికారి ఎవరు? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఈ నెల 17న జరగనున్న రాష్ట్ర సమాచార కమిషన్ విచారణలో పోలీసు అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారు? ఫుటేజీ అందజేతపై కమిషన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలు విచారణలో తేలాల్సి ఉంది.