BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆత్కూరులో ఎల్‌నినో ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 08:36 PM
25 వీక్షణలు

ప్రకృతిని కాపాడుకుందాం.. భవిష్యత్తును రక్షించుకుందాం: శ్రీనిధి పాఠశాల కరస్పాండెంట్ అంజనబాబు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీనిధి కాన్సెప్ట్ పాఠశాలలో మంగళవారం ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ బి. అంజనబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్‌నినో ప్రభావాల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, పర్యావరణంపై వాటి ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా అంజనబాబు మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే భవిష్యత్తు తరాలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, చిన్న వయస్సు నుంచే ప్రకృతిపై ప్రేమ, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, విద్యుత్‌, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ప్రకృతిని కాపాడుతామని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని, నీరు, విద్యుత్‌, ఇంధన వనరులను పొదుపుగా వినియోగిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రకృతిని కాపాడుకోవడమే భావితరాల భవిష్యత్తుకు భరోసా అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చందు, ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నా

రు.