12వ తరగతి వరకు చదివి.. ₹711 కోట్ల జుహూ టవర్ కొనుగోలు
జాతీయం
జాతీయం
ముంబై: 12వ తరగతి వరకు చదివి స్టాక్ బ్రోకింగ్ రంగంలో అడుగుపెట్టిన Angel One వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ ఠక్కర్ ఇప్పుడు రూ.711 కోట్ల విలువైన విలాసవంతమైన నివాస టవర్ కొనుగోలుతో వార్తల్లో నిలిచారు.
ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న Embassy Terrazza ప్రాజెక్టులోని మొత్తం G+7 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్‌ను సుమారు రూ.711 కోట్లకు కొనుగోలు చేసేందుకు దినేశ్ ఠక్కర్‌తో Embassy Developments ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ లావాదేవీ దేశంలోనే అత్యంత భారీ సింగిల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ టవర్ సుమారు 63,000 చదరపు అడుగుల RERA కార్పెట్ ఏరియా కలిగి ఉంది. సముద్రాన్ని వీక్షించేలా ఉన్న ఈ టవర్‌ను దినేశ్ ఠక్కర్ తన కుటుంబ నివాసంగా ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనికి ‘Angelus’ అనే పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. గోప్యత, విశాలమైన స్థలం, సముద్ర వీక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాపర్టీని ఎంపిక చేసినట్లు తెలిపారు.