BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 10 February 2026, 06:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరా

తెలంగాణ
10 Feb, 2026 - 06:53 AM
372 వీక్షణలు
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు పవన్ కళ్యాణ్ ఆసరా నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం, ఇల్లు మంజూరు, చదువుల బాధ్యత కలెక్టర్‌కు అప్పగింత NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి కొణిదెల పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అనాథ చిన్నారులకు ఆయన పూర్తి స్థాయి ఆసరా ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల లంగ్ క్యాన్సర్‌తో తల్లిని కోల్పోయారు. నివాసానికి ఇల్లు లేక, జీవనాధారం లేని పరిస్థితుల్లో ఉన్న ఈ చిన్నారులు తమ దుస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశంగా పంపించారు. ఈ వీడియో పవన్ కళ్యాణ్‌ను కదిలించింది. వెంటనే స్పందించిన ఆయన, చిన్నారులకు తన జీతం నుంచి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, వారికి తక్షణమే నివాసం కల్పించేలా ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లేదా కాలేజీల్లో చేర్పించి పూర్తి స్థాయి విద్య అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలకు తన జీతం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూసుకునే నాయకుడిగా మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు. #PawanKalyan #Pithapuram #HumanityInPolitics #SupportForOrphans #SocialResponsibility #AndhraPradesh #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube