BREAKING
thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
Date of Publish : 20 August 2026, 08:12 pm
Posted by : కూనురు మధు

టిటిడి కళ్యాణ మండప భూ వివాదానికి తెరదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Aug, 2026 - 08:12 PM
347 వీక్షణలు

టిటిడి కళ్యాణ మండప భూ వివాదానికి తెరదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

 భూమిపై సర్వే నిర్వహించి హద్దులు అధికారులకు ఆదేశం

చిట్యాల పట్టణ కేంద్రంలోని 649 సర్వేనెంబర్ లోని 1.12 గుంటల భూమిని టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2002లో కొనుగోలు చేయడం జరిగిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. గత కొద్దిరోజులుగా చిట్యాల పట్టణ కేంద్రంలోని భువనగిరి రోడ్డు లో 649 సర్వే నెంబర్ లో గల 1ఎకరం 12 గుంటల భూమి కబ్జాకు గురవుతుందని వస్తున్న ఆరోపణలపై గురువారం ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ శాసనమండలి సభ్యుడు చెరుపల్లి సీతారాములతో కలిసి ఆయన మాట్లాడారు. 2002లో చిట్యాల పట్టణ కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం టిటిడి కళ్యాణ మండపం నిర్మించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో పట్టణ కేంద్రంలోని భువనగిరి రోడ్డులో గల సర్వే నెంబర్ 649లో రోడ్డు ఫేస్ కలిగిన 1ఎకరం 12 గంటల భూమిని రెండు లక్షల 50 వేలకు ధర చేసుకొని 2,25,000 రూపాయలు చెల్లించి మిగిలిన సొమ్మును రిజిస్ట్రేషన్ అనంతరం చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం  జరిగిందని తెలిపారు. కాలక్రమేనా  అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో సంబంధిత గ్రామపంచాయతీ, మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో అట్టి భూమి గత కొద్ది రోజుల క్రితం కొంతమంది వ్యక్తులచే రోడ్డు ఫేస్ కలిగిన 12 గంటల భూమి ఆక్రమణకు గురి కావడంతో చిట్యాల పట్టణవాసులు ఆగ్రహించి ఇట్టి విషయాన్ని మీడియా, సంబంధిత అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఈ భూ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఆనాడు భూమి కొనుగోలు విషయంలో ప్రధాన పాత్ర పోషించిన ఈయన ఈ వివాదంపై స్పందిస్తూ రోడ్డు ఫేస్ నుంచి వెనుక వరకు హద్దులతో   1ఎకరం 12 గంటల భూమి విక్రయించిన మాట వాస్తవమేనని కానీ ప్రస్తుతం కొందరు వ్యక్తులు రోడ్డు ఫేస్ 12 గుంటల భూమి కబ్జా చేయడం సరి కాదని అట్టి భూమిని కబ్జా చేసి నాటిన ఫెన్సింగ్ పలకలను వెంటనే తొలగించి సర్వే చేయించి ఎకరం 12 గంటల భూమిని తిరిగి ఫెన్సింగ్ చేయాలని రెవిన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇట్టి భూమిని పట్టణ అవసరాల కోసం మున్సిపల్ పాలకవర్గ తీర్మానం మేరకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి  వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పాల్గొన్నారు..