BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:28 am
Posted by : K MAHESH

పదేళ్ల ప్రభుత్వ ఉద్యోగం.. రూ.20 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 08:28 AM
21 వీక్షణలు

మొయినాబాద్ మాజీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి నివాసాలు, ఆస్తులపై సోదాలు

యాదాద్రి / తెలంగాణ | ఎన్ టుడే న్యూస్

కేవలం పదేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఓ అధికారిణి వద్ద సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించినట్లు సమాచారం. మొయినాబాద్ మాజీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి ఇటీవల రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆస్తులపై అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఇళ్లు, స్థలాలు, బంగారం తదితర ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన అనంతరం ఆమెపై మరిన్ని ఆరోపణలు రావడంతో ఆస్తుల వివరాలపై ఏసీబీ దృష్టి సారించింది.

గుండు వాణి 2016లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఆమె తన కుమార్తె పేరిట ఓ కంపెనీని ప్రారంభించినట్లు కూడా ఆరోపణలు వెలువడ్డాయి. లంచాల ద్వారా సంపాదించిన డబ్బును ఆ కంపెనీలో జమ చేసి, తద్వారా వివిధ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే గుర్తించిన ఆస్తుల విలువ, వాటి కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, కంపెనీ లావాదేవీలపై పూర్తి వివరాలు అధికారిక విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఏసీబీ దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆస్తులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.