BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 24 August 2026, 08:48 pm
Posted by : ఈడూరి డేవిడ్

తాన్వి జన్మదినం సందర్భంగా దూబచర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
24 Aug, 2026 - 08:48 PM
50 వీక్షణలు

తాన్వి జన్మదినం సందర్భంగా దూబచర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం 

తాన్వి జన్మదినాన్ని పురస్కరించుకుని దూబచర్లలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో PARD ఇండియా నల్లజర్ల శాఖ, లయన్స్ క్లబ్ దూబచర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 200 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల, నిడదవోలు వైద్య బృందం ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సూచనలు, మందులు అందించారు. కంటి ఆపరేషన్ అవసరమైన 12 మందిని తదుపరి చికిత్స, శస్త్రచికిత్స నిమిత్తం నిడదవోలు లయన్స్ నేత్ర వైద్యశాలకు పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల డైరెక్టర్ కూచిపూడి ఉదయ భాస్కర్ రావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాతిన సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని PARD ఇండియా జాతీయ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, నల్లజర్ల శాఖ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు, ట్రెజరర్ జీవీవీ ప్రసాద్ సమన్వయం చేశారు.

లయన్స్ క్లబ్ దూబచర్ల అధ్యక్షులు తమ్మిన శ్రీనివాసరావు, సెక్రటరీ నెక్కంటి వెంకటేష్, ట్రెజరర్ మద్దుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే చీమకుర్తి కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ, మద్దాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

తాన్వి జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.