BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 24 August 2026, 08:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తేలికపాటి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:45 PM
64 వీక్షణలు

తేలికపాటి వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట మున్సిపల్ కమిషనర్ కే. మనోజ

తిరువూరు: తేలికపాటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు మున్సిపల్ కమిషనర్ కే. మనోజ తెలిపారు. వర్షాల కారణంగా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు, నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

వర్షాకాలంలో దోమలు, ఈగలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అపరిశుభ్రతకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడిగా వండిన ఆహార పదార్థాలను తీసుకోవాలని పేర్కొన్నారు. కలుషిత నీరు, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

“మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. వర్షాలు తేలికపాటిగానే ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి” అని కే. మనోజ కోరారు.

తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.