BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 05 August 2026, 06:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ లో ప్రతి సోమవారం మండల కేంద్రంలో మండల ప్రజావాణి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:03 AM
132 వీక్షణలు

తెలంగాణ లో ప్రతి సోమవారం మండల కేంద్రంలో ‘మండల ప్రజావాణి’

ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవస్థ

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్, ఆగస్టు 4 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసి, వారి సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ‘మండల ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్లానింగ్ (వి) శాఖ జీవో ఎంఎస్ నెం.4ను జారీ చేసింది.

జీవో ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో మండల ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీవో ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.

మండల తహసీల్దార్, ఎంపీవో, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, ఎంఈఓ, వైద్యాధికారి, సీడీపీవో, గృహనిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు–భవనాలు, అటవీ, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితర శాఖల అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలు అందజేసే ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు అందజేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి మండల కేంద్రంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యాలతో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.

అలాగే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చిన మహిళలకు ఫిర్యాదుల స్వీకరణలో ప్రాధాన్యత ఇవ్వాలని జీవోలో పేర్కొంది. ప్రస్తుతం జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో అమలులో ఉన్న ప్రజావాణి విధానాలు మండల ప్రజావాణికీ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ సమస్యలను మండల స్థాయిలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందే అవకాశం కలగనుంది.