BREAKING
thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
Date of Publish : 20 August 2026, 03:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌తో ఒకే బెంచ్‌లో కూర్చున్నా.. రోలర్ రఘు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:27 PM
136 వీక్షణలు

సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిన్ననాటి స్నేహితులుగా, సహాధ్యాయులుగా ఉండటం తరచూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా కమెడియన్ రోలర్ రఘు తన విద్యార్థి దశకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమాల్లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రఘు, అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ‘రోలర్ రఘు’గా మరింత ప్రజాదరణ పొందారు. ప్రస్తుతం సినిమాలతో పాటు స్వగ్రామంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోలర్ రఘు.. తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత జెట్టి కుసుమ కుమార్‌లకు కాలేజీ మిత్రుడినని తెలిపారు.

“ముగ్గురం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకే క్లాస్, ఒకే బెంచ్‌లో కూడా కూర్చున్నాం. 1989-90 సమయంలో దోమలగూడ ఏవీ కాలేజీలో కలిసి చదివాం. కుసుమ కుమార్ నాకు బంధువు అవుతారు. అప్పట్లోనే రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్ రాజకీయాల వైపు ఆసక్తి చూపించేవారు. నేను మాత్రం వారితో కలిసి రాజకీయాల్లో తిరగలేదు” అని రోలర్ రఘు వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత తన పాత జ్ఞాపకాలను రోలర్ రఘు పంచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.