BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 08:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణాలో త్వరలో రోడ్డుపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు.. బస్సు–ఆటో ప్రయాణానికి ఒకే టికెట్..!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 08:42 AM
60 వీక్షణలు

తెలంగాణాలో త్వరలో రోడ్డుపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు.. బస్సు–ఆటో ప్రయాణానికి ఒకే టికెట్..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. "ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ" పేరుతో త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రారంభించనుంది. ఈ కొత్త విధానంతో బస్సు ప్రయాణానికి అనుసంధానంగా ఆటో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఈ విధానంలో ప్రయాణికులు బస్సు, ఆటో టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇంటి నుంచి సమీప బస్ స్టాప్ వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలో చేరుకుని, అక్కడి నుంచి బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే గమ్యస్థానంలోని బస్ స్టాప్ వద్ద దిగిన తర్వాత అక్కడి నుంచి తుది గమ్యానికి కూడా అదే విధంగా ఆర్టీసీ ఆటో సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఈ ప్రాజెక్టును తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయనుండగా, అనంతరం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సులభమైన, వేగవంతమైన, పర్యావరణహిత రవాణా సేవలు అందించడంతో పాటు, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఆర్టీసీ లక్ష్యంగా భావిస్తోంది.