BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 02:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో కరెంట్ షాక్ మృతుల పరిహారం రూ.8 లక్షలకు పెంపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 02:37 PM
63 వీక్షణలు

హైదరాబాద్, జూలై 30: విద్యుత్ ప్రమాదాల్లో మరణించే బాధితుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పరిహారాన్ని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

ఈ పెరిగిన పరిహారం విద్యుత్ శాఖ ఉద్యోగులు కాని బాధితుల కుటుంబాలకు వర్తిస్తుంది. కొత్త విధానం ప్రకారం, మొత్తం రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్‌గా, మిగిలిన రూ.80 వేలను నగదు రూపంలో అందజేస్తారు.

పశువుల మృతికి కూడా పరిహారం పెంచారు. విద్యుత్ ప్రమాదంలో ఆవు, గేదె, దున్నపోతు మృతి చెందితే రూ.40 వేల పరిహారం, గొర్రె లేదా మేక మృతి చెందితే రూ.7 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు.

విద్యుత్ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.