BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 11:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుమలలో ఏసీబీ సోదాలు.. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో భారీగా ఆస్తుల గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 11:21 AM
80 వీక్షణలు

తిరుమల: కల్తీ నెయ్యి వ్యవహారంలో అనుమానితుల జాబితాలో ఉన్న తితిదే శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మొండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బుధవారం ఉదయం నుంచి తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని లోకనాథం నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగుల ఆస్తులపై వచ్చిన సమాచారంతో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు సోదాల్లో ప్రభుత్వ విలువ ప్రకారం సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

2 కిలోల బంగారం.. 6.50 కిలోల వెండి

లోకనాథం ఇంట్లో నిర్వహించిన సోదాల్లో బీరువాలో 2 కిలోల బంగారు ఆభరణాలు, 6.50 కిలోల వెండి వస్తువులు, రూ.12.50 లక్షల నగదు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జీ ప్లస్‌ త్రీ భవనంతో పాటు పక్క వీధిలోని జీ ప్లస్‌ వన్ భవనానికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

లోకనాథం భార్య మంజుల పేరుతో పెద్దకాపు లేఅవుట్‌లో నివాసం, గొల్లవానిగుంటలో రెండు ఇంటి స్థలాలు, వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యంలో ఓ ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. తిరుపతి శ్రీనివాసనగర్‌లో కుమారుడి పేరుతో ఇంటి స్థలం, లోకనాథం, ఆయన కుమారుడి పేరుతో బ్యాంకుల్లో నాలుగు స్థిర డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

బంధువుల ఇళ్లలోనూ సోదాలు

లోకనాథం బావలు మునికృష్ణ, రమేష్ నివాసాల్లోనూ ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. వారి ఇళ్లలో కలిపి రూ.28 లక్షల నగదు, రెండు కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగలోని లోకనాథం తమ్ముడు వేణు ఇంట్లోనూ మరో బృందం సోదాలు నిర్వహించింది. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న పది ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించినట్లు సమాచారం.

బ్యాంకు లాకర్‌లో ఏమీ లభ్యం కాలేదు

ఎస్వీబీనగర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌ను ఏసీబీ అధికారులు పరిశీలించగా అందులో ఎలాంటి వస్తువులు లభించలేదని తెలిసింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి లోకనాథం ఇంట్లో సోదాలు ప్రారంభించిన అధికారులు.. కుటుంబ సభ్యుల సమక్షంలోనే తనిఖీలు నిర్వహించారు.

1989లో తితిదేలో ఉద్యోగంలో చేరిన లోకనాథం

లోకనాథం 1989 ఫిబ్రవరి 1న కారుణ్య నియామకం కింద తితిదేలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఈవో, డిప్యూటీ ఈవోగా పదోన్నతులు పొందారు. 2023 ఏప్రిల్ నుంచి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా తిరుమలలో విధులు నిర్వహిస్తున్నారు.

తిరుమలలోని బీటైప్ క్వార్టర్స్‌లో ఉన్న ఆయన గదిని ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ.. అక్కడ సోదాలు నిర్వహించలేదని సమాచారం.

గురువారం పూర్తి వివరాలు

“తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించాం. గురువారం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలి” అని ఏసీబీ డీఎస్పీ మద్ది శ్రీనివాసరావు తెలిపారు.

2016లో అప్పటి డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. దాదాపు దశాబ్దం తర్వాత మరో తితిదే ఉద్యోగి నివాసంలో ఏసీబీ తనిఖీలు జరగడం తిరుమలలో చర్చనీయాంశంగా మారింది.