BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 12:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 12:17 PM
71 వీక్షణలు

3,007 మంది మృతి.. 6,186 మందికి వైరస్ నిర్ధారణ

కిన్షాసా | Ntoday News

ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మే 15 నుంచి ఇప్పటివరకు వైరస్ బారినపడి 3,007 మంది మృతి చెందగా, మరో 6,186 మందికి ఎబోలా సోకినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.

ఎబోలా వ్యాధి కాంగోలోని ఆరు ప్రాంతాలకు విస్తరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు సమాచారం. వైరస్ సోకిన వారిని సకాలంలో గుర్తించడం, వారికి తగిన వైద్యం అందించడం అధికారులకు సవాలుగా మారింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. ఎబోలా కారణంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 60 శాతం వైద్య చికిత్స కేంద్రాల వెలుపలే జరుగుతున్నాయి. దీంతో వ్యాధి వ్యాప్తిని గుర్తించి నియంత్రించడం మరింత క్లిష్టంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం కాంగోలో వ్యాప్తి చెందుతున్నది బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్గా అధికారులు గుర్తించారు. ఈ రకానికి ప్రత్యేకంగా ఆమోదించిన టీకా లేదా చికిత్స ప్రస్తుతం అందుబాటులో లేదని సమాచారం. అయితే వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా అందుబాటులో ఉన్న టీకాను వైద్య సిబ్బందికి అందించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.