BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 03 September 2026, 11:57 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైకోర్టు ఆదేశాలపై చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
03 Sep, 2026 - 11:57 AM
56 వీక్షణలు

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసులు

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిధుల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ దుర్గం రవీందర్ గతంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సంబంధిత అంశాలపై విచారణ జరిపి మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవాలని గతేడాది అక్టోబర్‌లో విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.

అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దుర్గం రవీందర్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం, కోర్టు ఆదేశాల అమలుపై వివరణ ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో అధికారులు తమ వైఖరిని, కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాల్సి ఉంటుంది.

గమనిక: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించిన అక్రమాల ఆరోపణలు పిటిషన్‌లో చేసిన ఆరోపణలు మాత్రమే; అవి న్యాయస్థానం తుది నిర్ణయంగా భావించరాదు.