BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
59 వీక్షణలు

లెక్కల్లో లేని రూ.2.48 లక్షల నగదు స్వాధీనం.. రికార్డుల పరిశీలన

తిరుపతి సిటీ: తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు.

సాయంత్రం సమయంలో ప్రారంభమైన తనిఖీలతో కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లలో ఆందోళన నెలకొంది. కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో నమోదు కాని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ నగదుకు సంబంధించిన వివరాలపై సబ్‌రిజిస్ట్రార్‌ లక్ష్మీదేవిని అధికారులు విచారించారు. అలాగే రిజిస్ట్రేషన్‌ రికార్డులు, దస్తావేజులు, నగదు లావాదేవీల వివరాలను పరిశీలించారు.

తనిఖీల సమయంలో కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లను కూడా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సోమవారం జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సైతం ఏసీబీ అధికారులు పరిశీలించారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.