BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

తిరుపతిలో డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నిరసన సీబీఐ విచారణ జరిపించాలి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి: ఆర్కే రోజా

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 03:10 PM
32 వీక్షణలు

తిరుపతి, జూలై 28: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజా డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపించారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన మెగా డీఎస్సీని "దగా డీఎస్సీ"గా మార్చేశారని విమర్శించారు.

నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే ప్రమాణం ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్తించాలని అన్నారు. డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించి నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

ఎస్‌సీఈఆర్‌టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తికి అత్యున్నత ర్యాంకు రావడం, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలు, మెరిట్ జాబితాల ప్రకటనలో పారదర్శకత లేకపోవడం, టీచర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు.

టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగాయనే వీడియోలు బయటకు వచ్చినప్పటికీ, అసలు సూత్రధారులను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.

డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను బెదిరించడం, క్రిమినల్ కేసుల హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నిరుద్యోగుల అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధిత అభ్యర్థుల ఆవేదనను పట్టించుకోవాలని కోరారు.

రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యార్థి సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలపై కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఈ నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు.