BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 08:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు మున్సిపల్ చైర్మన్ రేసులో గంజా కృష్ణ మోహన్ పేరు.. కాంగ్రెస్‌లో చర్చ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:15 AM
86 వీక్షణలు

తిరువూరు మున్సిపల్ చైర్మన్ రేసులో గంజా కృష్ణ మోహన్ పేరు.. కాంగ్రెస్‌లో చర్చ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు: తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవికి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రిజర్వేషన్ జనరల్ లేదా బీసీ జనరల్‌గా ఖరారైతే కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు గంజా కృష్ణ మోహన్‌ను బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న గంజా కృష్ణ మోహన్‌కు స్థానిక రాజకీయాలపై మంచి అవగాహనతో పాటు, పార్టీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నాయకులు పేర్కొంటున్నారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

అయితే చైర్మన్ పదవికి రిజర్వేషన్ ఖరారు కావడం, పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. మరోవైపు తిరువూరు మున్సిపల్ రాజకీయాల్లో ఇప్పటికే వివిధ పార్టీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున గంజా కృష్ణ మోహన్ పేరు తెరపైకి రావడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.